Nakrekal: ఉచిత కంటి వైద్య శిబిరం.. అద్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Nakrekal: నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం. బాధితులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం.

Update: 2026-08-22 07:22 GMT

Nakrekal: ఉచిత కంటి వైద్య శిబిరం.. అద్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Nakrekal: ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.​

ఈ సందర్భంగా శిబిరంలో పరీక్షలు చేయించుకుని, కంటి చికిత్స పొందిన బాధితులకు ఎమ్మెల్యే వేముల వీరేశం ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

అవసరమైన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు, వైద్య చికిత్సలు అందించడంతో పాటు, ఉచితంగా ఆపరేషన్లు చేయించి అద్దాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.​ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News