Nalgonda: ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్యపై భగ్గుమన్న డీవైఎఫ్‌ఐ క్యాండిల్ ర్యాలీ!

Nalgonda: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి ప్రిన్సిపాల్ రూపా రెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

Update: 2026-08-21 14:37 GMT

Nalgonda: ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్యపై భగ్గుమన్న డీవైఎఫ్‌ఐ క్యాండిల్ ర్యాలీ!

నల్గొండ: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్యను డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు. మృతురాలి కుటుంబానికి వారు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

​రూపా రెడ్డికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో DYFI ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన (క్యాండిల్ ర్యాలీ) నిర్వహించారు. మహిళలకు సమాజంలో రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు ఈ సందర్భంగా కోరారు.

Tags:    

Similar News