Suryapet: మోతే దంపతుల హత్య కేసు కానిస్టేబుల్‌ను డిస్మిస్ చేసిన ఎస్పీ
Suryapet: సూర్యాపేట జిల్లా మోతే దంపతుల హత్య కేసులో నిందితుడైన కానిస్టేబుల్ మహమ్మద్ షరీఫ్‌ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఎస్పీ నరసింహ ఉత్తర్వులు జారీ చేశారు.
Suryapet: మోతే దంపతుల హత్య కేసు కానిస్టేబుల్‌ను డిస్మిస్ చేసిన ఎస్పీ
Suryapet: మోతే మండల కేంద్రంలో భార్యాభర్తలను హత్య చేసి మృతదేహాలను వ్యవసాయ భూమిలో పాతిపెట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా పోలీస్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మోతే మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ దారుణంపై మోతే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సాంకేతిక ఆధారాలు, సమాచారంతో కేవలం 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసులో మోతే పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మహమ్మద్ షరీఫ్ ప్రధాన నిందితుడిగా తేలడంతో, ప్రస్తుతం అతను రిమాండ్‌లో ఉన్నారు. చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉండి ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం తీవ్రమైన క్రమశిక్షణా ఉల్లంఘనగా భావించిన ఎస్పీ, వెంటనే అతన్ని డిస్మిస్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ, "శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, నేరాలకు పాల్పడినా అది సొంత శాఖకు చెందిన వారైనా కఠిన చర్యలు తప్పవు. చట్టం ముందు అందరూ సమానులే" అని అన్నారు. ఈ ఘటనతో జిల్లాలో పోలీస్ శాఖ క్రమశిక్షణ పట్ల కఠినంగా వ్యవహరిస్తుందనే సంకేతాలు వెళ్లాయి.