Nalgonda: రూపారెడ్డి హత్య కేసులో ముమ్మరమైన పోలీసు దర్యాప్తు!

Nalgonda: కొండమల్లేపల్లి రూపారెడ్డి హత్య కేసులో వేగవంతమైన పోలీసు దర్యాప్తు. 90 మంది అనుమానితుల విచారణ. రియల్ ఎస్టేట్ వివాదాలే కారణమని అనుమానం.

Update: 2026-08-16 04:53 GMT

Nalgonda: రూపారెడ్డి హత్య కేసులో ముమ్మరమైన పోలీసు దర్యాప్తు!

Nalgonda: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. హత్యకు దారితీసిన కారణాలను అన్వేషించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు 90 మంది అనుమానితులను పోలీసులు క్షుణ్ణంగా విచారించారు.

రూపారెడ్డి దంపతులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతుండటంతో, భూ లావాదేవీలు లేదా ఆర్థిక వ్యత్యాసాలే హత్యకు కారణమా అన్న కోణంలో ప్రధానంగా విచారణ జరుపుతున్నాట్లు సమాచారం.రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎదురైన పాత కక్షలు, లావాదేవీల వివాదాల వల్లే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు బలమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ​పోలీసులు సాంకేతిక ఆధారాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులను సేకరిస్తూ, త్వరలోనే నిందితులను పట్టుకునేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు.

Tags:    

Similar News