Nalgonda: జి.కె. అన్నారం పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు

Nalgonda: నల్గొండ మండలం జి.కె. అన్నారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన హెచ్‌ఎం సైదులు. పాల్గొన్న విద్యార్థులు.

Update: 2026-08-15 13:08 GMT

Nalgonda: జి.కె. అన్నారం పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు

నల్గొండ: నల్గొండ మండలం జి.కె. అన్నారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (హెచ్‌ఎం) సైదులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

​అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News