Nalgonda: నల్లగొండలో విగ్రహాల తొలగింపు యత్నంపై తీవ్ర నిరసన

Nalgonda: నల్లగొండ మర్రిగూడెం బైపాస్‌లోని బుద్ధవనంలో విగ్రహాల తొలగింపు కుట్రను అడ్డుకున్న కేవీపీఎస్, సామాజిక సంఘాల నాయకులు. ఘటనా స్థలంలో ఆందోళన.

Update: 2026-08-04 14:40 GMT

Nalgonda: నల్లగొండలో విగ్రహాల తొలగింపు యత్నంపై తీవ్ర నిరసన

నల్లగొండ: నల్లగొండ పురపాలక సంఘం పరిధిలోని మర్రిగూడెం బైపాస్ జంక్షన్‌లోని బుద్ధవనంలో ఉన్న బాబాసాహెబ్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్, బుద్ధుడి విగ్రహాలను తొలగించేందుకు కుట్ర జరుగుతోందంటూ కేవీపీఎస్, వివిధ సామాజిక సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

​విషయం తెలుసుకున్న నాయకులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. విగ్రహాలకు ఎలాంటి హాని తలపెట్టినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేస్తూ అక్కడ ఆందోళన చేపట్టారు.

Tags:    

Similar News