Nalgonda: నల్లగొండలో ఘనంగా కామ్రేడ్ యానాల మల్లారెడ్డి వర్ధంతి

Nalgonda: నల్లగొండ శ్రామిక భవన్‌లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ యానాల మల్లారెడ్డి 24వ వర్ధంతి. ఆయన త్యాగాలను స్మరించుకున్న సీపీఐ (ఎం-ఎల్) నాయకులు.

Update: 2026-08-04 09:46 GMT

Nalgonda: నల్లగొండలో ఘనంగా కామ్రేడ్ యానాల మల్లారెడ్డి వర్ధంతి

నల్లగొండ: ​తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నాయకుడు కామ్రేడ్ యానాల మల్లారెడ్డి 24వ వర్ధంతిని శ్రామిక భవన్‌లో మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ.. నిజాం, రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడి, పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మల్లారెడ్డి ఉద్యమ జీవితం నేటి యువతకు ఆదర్శమని కొనియాడారు.

భూమిలేని పేదలకు వందలాది ఎకరాలు పంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

Tags:    

Similar News