Nalgonda: సర్కారీ బడుల సమస్యలు తీర్చాలి ఐద్వా నేత ప్రభావతి
Nalgonda: నల్లగొండ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిఆర్ఓకు వినతిపత్రం అందజేసిన ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి.
Nalgonda: సర్కారీ బడుల సమస్యలు తీర్చాలి ఐద్వా నేత ప్రభావతి
నల్గొండ: నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న వివిధ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు.
మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా డిప్యూటీ రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ)కి ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బడుల్లో మౌలిక వసతులు కల్పించి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు