Miryalaguda: మిర్యాలగూడ త్రిపుల్ మర్డర్ మిస్టరీ ఛేదించిన పోలీసులు
Miryalaguda: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ త్రిపుల్ మర్డర్ మిస్టరీని నల్గొండ పోలీసులు ఛేదించారు.
Miryalaguda: మిర్యాలగూడ త్రిపుల్ మర్డర్ మిస్టరీ ఛేదించిన పోలీసులు
Miryalaguda: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ త్రిపుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు చేదించారు.17 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మిర్యాలగూడ త్రిపుల్ మర్డర్ కేసును నల్గొండ పోలీసులు ఛేదించారు. ప్రమాదంగా భ్రమపడిన ఆ ఘటన వెనుక, పగతో రగిలిపోయిన ఒక హంతకుడి క్రూరమైన పథకం ఉందని పోలీసులు తేల్చారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన కాళహస్తి శిరీష్ కుమార్, మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన ధనలక్ష్మిని వివాహం చేసుకున్నాడు.
ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ధనలక్ష్మిపై పెంచుకున్న కక్షతో ఆమె కుటుంబంపై దాడికి ప్లాన్ చేశాడు. రోజుల తరబడి రెక్కీ నిర్వహించిన నిందితుడు, స్కూటీ దొంగిలించి మిర్యాలగూడకు చేరుకున్నాడు. మార్గమధ్యలో పెట్రోల్ క్యాన్ కొనుగోలు చేసి, అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో వనం చంద్రమ్మ (48), లక్ష్మణ్ (17), ప్రణతి (15) సజీవ దహనమయ్యారు.
ఘటనా స్థలంలో లభించిన ఒక బకెట్, సీసీటీవీ ఫుటేజీలు, మరియు సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన నల్గొండ పోలీసులు, నిందితుడిని పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ రంగంలోకి దించారు. నిందితుడి వద్ద నుండి కాలిన షర్ట్, హెల్మెట్, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదంలా కనిపించిన ఈ దారుణాన్ని, ఎంతో పకడ్బందీగా ఛేదించిన పోలీసుల పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.