Nakrekal: హరిత తెలంగాణే లక్ష్యం నకిరేకల్‌లో ఘనంగా వనమహోత్సవ కార్యక్రమం
Nakrekal: నకిరేకల్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన వనమహోత్సవం కార్యక్రమంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని మొక్కలు నాటారు.
Nakrekal: హరిత తెలంగాణే లక్ష్యం నకిరేకల్‌లో ఘనంగా వనమహోత్సవ కార్యక్రమం
నకిరేకల్: వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా నకిరేకల్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం "హరిత తెలంగాణ" లక్ష్యంగా విస్తృతంగా మొక్కల పెంపకం చేపడుతోందని తెలిపారు. గ్రామాలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.
వనమహోత్సవం, వంటి కార్యక్రమాల ద్వారా కోట్లాది మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, భూగర్భ జలాల తగ్గుదల వంటి సమస్యలను అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే గారు సూచించారు.
మొక్కలు మనిషి మనుగడకు ఆధారం అని, భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే పచ్చదనం పెంపు అత్యంత అవసరమని అన్నారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను నాటి వాటికి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు మున్సిపల్ అధికారులు ఆసుపత్రి సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.