Nalgonda: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Nalgonda: రామన్నగూడెం స్టేజీ వద్ద ఇవాళ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సాయికుమార్, థాంసయ్య, ప్రకాశ్‌రావు అనే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Update: 2026-06-19 06:30 GMT

Nalgonda: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

నల్లగొండ: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెం స్టేజీ వద్ద ఇవాళ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అతివేగంతో దూసుకొచ్చిన రెండు కార్లు అదుపుతప్పి ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే, రెండు కార్ల ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి.

​ఈ దుర్ఘటనలో సాయికుమార్, థాంసయ్య, ప్రకాశ్‌రావు అనే ముగ్గురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు, 108 వాహనంలో క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన అధికారులు, కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Tags:    

Similar News