Kodad: అంబులెన్స్ కంటే ముందే చేరిన ఎస్ఐ.. క్షతగాత్రుల తరలింపు
Kodad: మునగాల వద్ద జాతీయ రహదారిపై స్కూటీ ప్రమాదంలో గాయపడిన దంపతులను అంబులెన్స్ కంటే ముందే చేరి పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించిన ఎస్ఐ సంజీవరెడ్డి.
Kodad: అంబులెన్స్ కంటే ముందే చేరిన ఎస్ఐ.. క్షతగాత్రుల తరలింపు
కోదాడ: ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు మునగాల ఎస్ఐ సంజీవరెడ్డి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని వ్యక్తిని తప్పించబోయి స్కూటీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో స్కూటీపై సూర్యాపేట నుంచి కోదాడకు వస్తున్న భార్యాభర్తలు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే మునగాల ఎస్ఐ సంజీవరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ కోసం వేచి చూడకుండా క్షతగాత్రులను పోలీసు వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో స్పందించి క్షతగాత్రులకు సకాలంలో వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్న ఎస్ఐ సంజీవరెడ్డి, మునగాల పోలీసులపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేశారు.