Miryalaguda: ఇందిరా జీవిత బీమా నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే!
Miryalaguda: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇందిరా జీవిత బీమా పథకం నమోదు కేంద్రాలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించి ప్రక్రియను పరిశీలించారు.
Miryalaguda: ఇందిరా జీవిత బీమా నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే!
మిర్యాలగూడ: మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇందిరా జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నమోదు కేంద్రాలను సందర్శించి, పథకం అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరా జీవిత బీమా పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నమోదు ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అర్హులందరి వివరాలు సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజల సంక్షేమం, సామాజిక భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు.