Suryapet: కోదాడలో భగ్గుమన్న బీఆర్ఎస్ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై భారీ ధర్నా!

Suryapet: కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కోదాడ బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ భారీ ధర్నా. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఆందోళన.

Update: 2026-07-12 10:12 GMT

Suryapet: కోదాడలో భగ్గుమన్న బీఆర్ఎస్ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై భారీ ధర్నా!

Suryapet: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగడం, హుందాతనానికి భంగమని బొల్లం మల్లయ్య యాదవ్ మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులపై రక్తం చిందించాలనే రీతిలో వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని, రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

పాలనపై, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం, రాజకీయ విమర్శలతో కాలం గడపడం విచారకరమని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు సమాజంలో ఉద్రిక్తతలకు దారితీస్తాయని, రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోకపోతే తెలంగాణ ముఖద్వారం కోదాడ నుండి మరో ఉద్యమం మొదలవుతుందని బొల్లం మల్లయ్య యాదవ్ ఘాటుగా హెచ్చరించారు.

Tags:    

Similar News