Nalgonda: ఉపాధ్యాయులపై హింస నశించాలి నిరసన ర్యాలీ, పూలమాల వేసి నివాళులు
Nalgonda: నకిరేకల్‌లో TRSMA, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీల ర్యాలీ. కీ.శే. కల్లు రూపా రెడ్డికి న్యాయం చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్.
Nalgonda: ఉపాధ్యాయులపై హింస నశించాలి నిరసన ర్యాలీ, పూలమాల వేసి నివాళులు
Nalgonda: నకిరేకల్ నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం మరియుTRSMA ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్ ర్యాలీ నకిరేకల్ మండలం..
నియోజకవర్గంలో విధి నిర్హత్యకు గురైన కీ.శే. కల్లు రూపా రెడ్డి న్యాయం చేయాలని, ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నకిరేకల్ మండల TRSMA శాఖ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు "We Stand United for Justice", "Stop Violence Against Teachers", "Justice for Roopa Reddy" అనే నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం రూపా రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో TRSMA మండల నాయకులు, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.