వెంకటేష్-త్రివిక్రమ్ ‘AK47’ రిలీజ్ డేట్ లాక్.. దసరా బరిలో ‘ఆదర్శ కుటుంబం’!
Adarsha Kutumbham: టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ క్రేజీ కాంబినేషన్లలో ఒకటైన విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ చిత్రంపై ఎట్టకేలకు ఒక అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది.
వెంకటేష్-త్రివిక్రమ్ ‘AK47’ రిలీజ్ డేట్ లాక్.. దసరా బరిలో ‘ఆదర్శ కుటుంబం’!
Adarsha Kutumbham: టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ క్రేజీ కాంబినేషన్లలో ఒకటైన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రంపై ఎట్టకేలకు ఒక అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది. వీరిద్దరి కాంబినేషన్‌లో సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ నిమా విడుదలపై గత కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ మేకర్స్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ఖరారు చేశారు.
అక్టోబర్ 2న థియేటర్లలోకి.. నిర్మాత నాగవంశీ క్లారిటీ!
ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ఈ ఏడాది గాంధీ జయంతి , దసరా పండుగ కానుకగా అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోందని స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ కన్ఫర్మ్ చేశారు. ఈరోజు ఉదయమే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ కొత్త సినిమా (#VenkyAnil5) గ్రాండ్‌గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఆ జోష్‌లో ఉండగానే, ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అవ్వడంతో వెంకీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ ప్లాన్.. క్రేజీ స్టార్ కాస్టింగ్!
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామాలో నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకటేష్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా, త్రివిక్రమ్ మార్క్ క్లాసిక్ ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు హిల్లేరియస్ డైలాగ్స్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
థమన్ మ్యూజిక్.. బాక్సాఫీస్ రేసు షురూ!
ఈ చిత్రానికి టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్-థమన్ కాంబినేషన్‌లో వచ్చే ఆల్బమ్స్ ఎంతటి సంచలనాలు సృష్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు రిలీజ్ డేట్ లాక్ అవ్వడంతో, ఇకపై బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ , టీజర్, సాంగ్స్ అప్‌డేట్స్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అక్టోబర్ పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి!