Panchali Panchabhartruka Review: అదరగొట్టిన కామెడీ థ్రిల్లర్..!

Panchali Panchabhartruka Review: గంగా సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కిన 'పాంచాలి పంచభర్తృక' మూవీ పూర్తి రివ్యూ.

Update: 2026-08-15 04:39 GMT

Panchali Panchabhartruka Review: అదరగొట్టిన కామెడీ థ్రిల్లర్..!

Rajendra Prasad: ఒక పక్కా సస్పెన్స్ థ్రిల్లర్ కథకు కామెడీని జోడించి తీయడం కత్తిమీద సాము లాంటిది. కానీ, ఆ రెంటినీ సమపాళ్లలో మిక్స్ చేసి ప్రేక్షకులకు థ్రిల్‌తో పాటు నవ్వులు పంచిపెట్టిన చిత్రం 'పాంచాలి పంచభర్తృక' దర్శకుడు గంగా సప్తశిఖర తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో పూర్తి రివ్యూలోకి వెళ్దాం.

కథ

కథ డాక్టర్ దమయంతి కిడ్నాప్‌తో ప్రారంభమవుతుంది. 'డాన్సన్' అనే క్రిమినల్ గ్యాంగ్ ఆమెను బెదిరించి తమ అక్రమ బిజినెస్‌లో సహకరించేలా ఒప్పిస్తుంది. మరోవైపు, సీరియల్స్ తీసే చిత్తరంజన్ (జెమిని సురేష్) ఎలాగైనా సినిమా తీయాలనే కసితో ఉంటాడు. అద్దె ఇంటి కోసం వెతుకుతున్న కాట్‌రాజ్, పుష్పరాజ్‌లకు చిత్తరంజన్ తన పెంట్ హౌస్‌లో ఆశ్రయమిస్తాడు. అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ బాబ్జీని పొగిడి బుట్టలో వేసుకుని అంతా ఒకటవుతారు. ఒకరోజు సరదాగా గడపటానికి ఆన్‌లైన్‌లో 'సెనోరిటా' అనే అమ్మాయిని బుక్ చేసుకుంటారు. నలుగురూ ఓ పనిమీద బయటకు వెళ్లొచ్చేసరికి సెనోరిటా రక్తపు మడుగులో శవమై కనిపిస్తుంది. పోలీస్ కేసవుతుందని భయపడి శవాన్ని ఒక సూట్‌కేసులో దాచితే... ఆ శవంతో ఉన్న సూట్‌కేసే మాయమవుతుంది. తర్వాత ఏం జరిగిందనదే మిగిలిన కథ.

విశ్లేషణ

ఈ సినిమాకు ప్రధాన బలం స్క్రీన్ ప్లే. కథను ప్రారంభించడమే కమెడియన్ సునీల్ వాయిస్ ఓవర్తో చాలా వెరైటీగా, ఆసక్తికరమైన పాత్రల పేర్లతో పరిచయం చేశారు. పాత్రల పరిచయం, నలుగురి మధ్య వచ్చే వినోదాత్మక సన్నివేశాలు మరియు మర్డర్ సీన్‌తో ఎక్కడా బోర్ కొట్టకుండా హాయిగా సాగిపోతుంది. హత్య ఎవరు చేశారనే కోణంలో సాగుతూ, చిక్కుముడులను ఎక్కడా గందరగోళం లేకుండా విప్పిన తీరు ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే రెండు ఊహించని ట్విస్టులు ఒకదానికొకటి పోటీ పడుతూ ప్రేక్షకులను మైమరిపిస్తాయి. లాస్ట్ మినిట్ వరకు హంతకుడు ఎవరనేది గెస్ చేయడం అసాధ్యం.

సస్పెన్స్ ఎలిమెంట్స్

అసలు ఆ సూట్‌కేస్ ఎక్కడికి పోయింది? ఇందులో పరమసుందరి పాత్ర ఏమిటి? అసలు రోజ్‌మేరి ఎవరు..? సీక్రెట్ ఏజెంట్ ఏడుకొండలు అలియాస్ ఎకో ఈ మిస్టరీని ఎలా ఛేదించాడు? అనేది వెండితెరపైనే చూడాలి.

నటీనటుల పనితీరు

రాజేంద్ర ప్రసాద్, పృథ్వీరాజ్ ఈ ఇద్దరూ తమ మార్కు కామెడీ టైమింగ్‌తో థియేటర్లో నవ్వులు పూయించారు. జెమిని సురేష్‌కు చిత్తరంజన్‌గా మంచి ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది, దాన్ని అద్భుతంగా వినియోగించుకున్నారు. రోల్ రైడా చాలా కాలం తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించి మెప్పించారు. రాజ్ పవన్ నిర్మాతగా వ్యవహరిస్తూనే ఒక కీలక పాత్రలో నటించి, కొత్తవాడైనా ఎక్కడా తడబడకుండా బాగా చేశారు.

సాంకేతిక విభాగం

దర్శకుడు గంగా సప్తశిఖర ఈ చిత్రాన్ని ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించడంలో వంద శాతం సక్సెస్ అయ్యారు. అనుభవజ్ఞుడైన దర్శకుడిలా ప్రతి పాత్రకూ ప్రాధాన్యమిచ్చారు. అంతేకాకుండా, స్వయంగా ఆయన నటించిన సీక్రెట్ ఏజెంట్ ఏడుకొండలు పాత్ర కామెడీ పరంగా హైలైట్‌గా నిలిచింది. రాజ్ పవన్ సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలను కూడా పర్యవేక్షించారు. టైటిల్ సాంగ్ ఆకట్టుకోగా, మిగిలిన పాటలు ఓకే అనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా చాలా బాగున్నాయి.

ఫైనల్‌గా

రోజ్‌మేరి అనేది కేవలం మర్డర్ మిస్టరీ మాత్రమే కాదు.. అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్. అనవసరమైన సన్నివేశాలు లేకుండా, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ,కామెడీ టైమింగ్‌తో సాగే ఈ చిత్రం థ్రిల్లర్ ప్రేమికులను, కామెడీ ప్రియులను ఖచ్చితంగా అలరిస్తుంది.

Rating: 3/5

Tags:    

Similar News