Chennai Love Story: నెల రోజుల్లోనే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ'.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?

Chennai Love Story: కిరణ్ అబ్బవరం, గౌరి ప్రియ నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' ఈ నెల 21 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సోనీ లివ్ అధికారిక ప్రకటన చేసింది.

Update: 2026-08-15 06:41 GMT

Chennai Love Story: నెల రోజుల్లోనే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ'.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?

Chennai Love Story: టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆయన సరసన గౌరి ప్రియ హీరోయిన్‌గా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్‌ 'చెన్నై లవ్ స్టోరీ' థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.

ప్రముఖ ఓటీటీ సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం అలాగే హిందీ భాషలలో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. కేవలం పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్‌తో దర్శకుడు రవి నంబూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా అరవై కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది.

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారనేదానికి ఈ సినిమా ఒక చక్కటి ఉదాహరణగా నిలిచింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ నెల 21 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రం డిజిటల్‌లో కూడా భారీ వ్యూస్‌ను సొంతం చేసుకుంటుందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు.


Tags:    

Similar News