'హైవాన్' ఫస్ట్ లుక్ విడుదల: 17 ఏళ్ల తర్వాత అక్షయ్-సైఫ్ మ్యాజిక్!

Haiwaan: టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'హైవాన్'.

Update: 2026-07-16 09:57 GMT

'హైవాన్' ఫస్ట్ లుక్ విడుదల: 17 ఏళ్ల తర్వాత అక్షయ్-సైఫ్ మ్యాజిక్!

Haiwaan: టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'హైవాన్'. అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'ఒప్పం' చిత్రానికి ఇది రీమేక్. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

భయపెడుతున్న అక్షయ్, ఇంటెన్స్‌గా సైఫ్!

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ఎరుపు , నలుపు రంగుల నేపథ్యంలో విడుదలైన ఈ పోస్టర్లలో, అక్షయ్ కుమార్ భయంకరమైన విలన్ పాత్రలో కళ్లు కప్పుకుని కనిపిస్తుంటే, సైఫ్ అలీ ఖాన్ ఇంటెన్స్ లుక్‌లో అలరిస్తున్నారు. "Vengeance sees everything" , "Every sense is a weapon" అనే క్యాప్షన్లు సినిమాలోని ఉత్కంఠను తెలియజేస్తున్నాయి. అక్షయ్ కుమార్ పిచ్చెక్కించే నవ్వు, సైఫ్ అలీ ఖాన్ తీవ్రమైన చూపులు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.

17 ఏళ్ల తర్వాత కలిసిన క్రేజీ కాంబో

అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ , దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్ మొదటిసారి వెండితెరపైకి రాబోతోంది. 'తషాన్' (2008) చిత్రం తర్వాత దాదాపు 17 ఏళ్లకు ఈ ఇద్దరు స్టార్ హీరోలు మళ్లీ కలిసి నటిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ఒక భయానకమైన విలన్ పాత్రలో కనిపిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ దృష్టిలోపం ఉన్న సంగీత ఉపాధ్యాయుడిగా నటించనున్నారు. ఈ పాత్ర తనకెంతో సవాలుగా అనిపించిందని సైఫ్ పేర్కొన్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇందులో అతిథి పాత్రలో మెరవనుండటం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ.

థ్రిల్లింగ్ కథాంశం.. సెప్టెంబర్ 11న విడుదల!

దృష్టిలోపం లోపం ఉన్న ఒక వ్యక్తి, ఒక చిన్నారిని కాపాడే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇది ఒక డేవిడ్-గోలియత్ తరహా పోరాటమని, ప్రతి సన్నివేశం కొత్త అనుభూతిని ఇస్తుందని సైఫ్ తెలిపారు. సాయిధామి ఖేర్, శ్రియా పిల్గాంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రియదర్శన్ మార్క్ థ్రిల్లర్ కావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా సెన్సేషన్ సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Full View

Tags:    

Similar News