Ragini 3: భయపెట్టేందుకు సిద్ధమైన తమన్నా: 'రాగిణి 3' షూటింగ్ షురూ!

Ragini 3: ప్రముఖ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'రాగిణి' మూడో అధ్యాయం అధికారికంగా మొదలైంది.

Update: 2026-07-16 06:24 GMT

Ragini 3: భయపెట్టేందుకు సిద్ధమైన తమన్నా: 'రాగిణి 3' షూటింగ్ షురూ!

Ragini 3: ప్రముఖ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'రాగిణి' మూడో అధ్యాయం అధికారికంగా మొదలైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'రాగిణి 3' చిత్రీకరణ తాజాగా ప్రారంభమైంది. కొత్త తారాగణం, సరికొత్త సృజనాత్మక బృందంతో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కథాంశం గురించి మేకర్స్ గోప్యత పాటిస్తున్నప్పటికీ, షూటింగ్ ప్రారంభోత్సవానికి సంబంధించిన తాజా అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్లాప్‌బోర్డ్‌తో తమన్నా సందడి

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటి తమన్నా భాటియా కీలక పాత్రలో నటించనున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షూటింగ్ సెట్ నుంచి ఒక ఫోటోను షేర్ చేశారు. అందులో ఆమె “Day 01” అని రాసి ఉన్న క్లాప్‌బోర్డ్‌ను పట్టుకుని కనిపించారు. దీంతో తమన్నా ఈ ప్రాజెక్టులో భాగమైందనే విషయం అధికారికంగా ధృవీకరించబడింది.

కొత్త దర్శకుడు - సరికొత్త ప్రయోగం

గత భాగాలకు భిన్నంగా 'రాగిణి 3'ని దర్శకుడు శశాంక ఘోష్ తెరకెక్కిస్తున్నారు. సూపర్ నేచురల్ హారర్ , సస్పెన్స్ అంశాల కలయికతో ఈ చిత్రాన్ని మరింత ఉత్కంఠభరితంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో తమన్నాతో పాటు ఆయుష్ శర్మ, జునైద్ ఖాన్ , నర్గీస్ ఫక్రి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

భారీ నిర్మాణ సంస్థల కలయిక

ఈ చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, టిప్స్ ఫిల్మ్స్ , జై హో మీడియా వెంచర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏక్తా కపూర్, శోభా కపూర్, అమర్ బుటాలా, కుమార్ తౌరానీ , గిరీష్ కుమార్ వంటి దిగ్గజ నిర్మాతలు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సుధాకర్ రెడ్డి యక్కంటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్, రాబోయే నెలల్లో మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News