Medak: చారిత్రక మెదక్ కోటపై ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల!
Medak: మెదక్ కోటపై భారతీయ తపాలా శాఖ రూపొందించిన ప్రత్యేక పోస్టల్ కవర్, స్మారక ముద్రను మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావు, ప్రముఖులు విడుదల చేశారు.
Medak: చారిత్రక మెదక్ కోటపై ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల!
మెదక్ ఆగస్టు 17: తెలంగాణ వైభవానికి, కాకతీయుల శిల్పకళా ప్రతీకగా నిలిచే “మెదక్ ఖిల్లా” (మెదక్ కోట) కీర్తిమకుటంలో మరొక అరుదైన గౌరవం చేరింది. భారతీయ తపాలా శాఖ మెదక్ కోట చారిత్రక ప్రాధాన్యతను గుర్తించి, దాని విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ప్రత్యేక పోస్టల్ కవర్ మరియు స్మారక ముద్రను సోమవారం మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో “మెదక్ ఖిల్లా” ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తపాలా శాఖ అధికారి విజయ్ కుమార్. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్.జిల్లా అదనపు ఎస్పీ. మెదక్ ఆర్డిఓ మున్సిపల్ కమిషనర్ మేనేజర్ మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతి రాజ్.మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ జిల్లా ప్రముఖులు పాల్గొని ఈ పోస్టల్ కవర్ ను అధికారికంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, తెలంగాణలోనే అతిపెద్ద కొండకోటల్లో ఒకటైన మెదక్ కోటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో పర్యటకంగా ఎంతో అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం హైదరాబాదుకు కూతబెట్టి దూరంలో ఉండి అన్ని రంగాలలో పర్యాటకంగా ఎంతో అభివృద్ధికి ప్రభుత్వం చేస్తుందని తెలిపారు ముఖ్యంగా మెదక్ చర్చ్ ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం పోచారం ప్రాజెక్టు కేంద్రం. జినకల ప్రత్యుత్పత్తి కేంద్రం. నర్సాపూర్ అరణ్యం
కొల్చారం వద్ద జైన్ మందిర్ వంటి ప్రాంతాలు పర్యాటకులకు ఎంతో ఆకర్షణగా నిలుస్తున్నాయని ప్రభుత్వం వీటిని పర్యాటకంగా అభివృద్ధి పరచడానికి సిద్ధంగా ఉందని దశలవారీగా పనులు చేస్తామని ఆయన తెలిపారు.
చారిత్రక నేపథ్యం: మెదక్ ఖిల్లాకు 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో శత్రుదుర్భేద్యమైన రాతి కోటగా ఇది నిర్మించబడింది.శిల్పకళా చాతుర్యం: కోటలో ఉన్న ప్రథమ ద్వారాన్ని 'సింహ ద్వారం' అని, రెండవ ద్వారాన్ని 'ఏనుగు ద్వారం' అని పిలుస్తారు. కాకతీయుల శిల్పకళా వైభవానికి ఇవి నిలువెత్తు నిదర్శనాలు. సహజ సిద్ధమైన రక్షణ: ఎత్తైన కొండపై శత్రువులకు చిక్కని రీతిలో నిర్మించిన ఈ కోట, తెలంగాణ సైనిక వ్యూహాలకు ప్రతిరూపం.
ఈ పోస్టల్ కవర్ విడుదల కావడం పట్ల జిల్లా ప్రజలు, చరిత్రకారులు మరియు పర్యాటక ప్రియులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ కవర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాంప్ కలెక్టర్లు (Philatelists) ລ້ పర్యాటకులకు మెదక్ జిల్లా ప్రాముఖ్యత మరింతగా తెలుస్తుందని భావిస్తున్నారు.