Narsapur: నర్సాపూర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సునీతారెడ్డి

Narsapur: నర్సాపూర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. RDO ఆఫీస్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి, విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీతారెడ్డి.

Update: 2026-08-15 08:41 GMT

Narsapur: నర్సాపూర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సునీతారెడ్డి

Narsapur: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నర్సాపూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పలు ముఖ్య ప్రాంతాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు.

సివిల్ జడ్జి కోర్టు, ఆర్డీవో కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతంతో పాటు దేశభక్తి నినాదాలు మార్మోగాయి.

ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనూ జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

మరోవైపు నర్సాపూర్ పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని పట్టణ వీధుల్లో సందడి చేశారు. దేశభక్తి నినాదాలు చేస్తూ, జాతీయ జెండాలతో ర్యాలీలుగా తరలివెళ్లడంతో పట్టణ వీధులు త్రివర్ణ శోభతో కళకళలాడాయి.

ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని నాయకులు పిలుపునిచ్చారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో నర్సాపూర్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో నర్సాపూర్ సివిల్ జడ్జ్ హేమలత నర్సాపూర్ rdo రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్, కౌన్సిలర్ బుల్లెట్ రాజు, నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమ్, చంద్ర గౌడ్,నాగరాజు గౌడ్, రింగుల ప్రసాద్,పట్టణ అధ్యక్షులు బిక్షపతి, మహిపాల్ రెడ్డి శ్రవణ్ కుమార్,, బోగా శేఖర్ తదితరులు ఫాల్గొన్నారు. విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు పెన్నులు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణి చేసారు.

Tags:    

Similar News