Chennur: జాతీయ రహదారిపై నార్కోటిక్ డాగ్‌తో పోలీసుల మెరుపు తనిఖీలు!
Chennur: మంచిర్యాల జిల్లా చెన్నూర్ NH 63 సమీపంలో నార్కోటిక్ డాగ్‌తో పోలీసుల విస్తృత తనిఖీలు. మత్తు పదార్థాలు, గంజాయి రవాణాపై ఉక్కుపాదం.
Chennur: జాతీయ రహదారిపై నార్కోటిక్ డాగ్‌తో పోలీసుల మెరుపు తనిఖీలు!
Chennur: మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
పట్టణ సమీపంలో గల 63వ జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లోని హోటల్స్, పాన్ షాపులతో పాటు అనుమానిత ప్రదేశాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
నాటుసారా, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
అనుమానిత ప్రదేశాలు, ప్రాంతాలను గుర్తించి, నార్కోటిక్ డాగ్ సహాయంతో తరచూ తనిఖీలు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్‌కు బానిసలై తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచించారు.
మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై ఎక్కడైనా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.