Mancherial: అడ్వకేట్స్ క్రికెట్ టోర్నీ ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి!

Mancherial: మంచిర్యాల డిగ్రీ కాలేజ్ మైదానంలో అడ్వకేట్స్ క్రికెట్ టోర్నమెంట్‌ ప్రారంభం. టాస్ వేసి పోటీలను ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య.

Update: 2026-08-11 06:12 GMT

Mancherial: అడ్వకేట్స్ క్రికెట్ టోర్నీ ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి!

Mancherial: మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అడ్వకేట్స్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య టాస్ వేసి పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రీన్ టీం, ఎల్లో టీం జట్లు పోటీపడ్డాయి. న్యాయవాదుల మధ్య స్నేహభావం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, వృత్తిపరమైన ఒత్తిడిని అధిగమించేందుకు ఇలాంటి క్రీడా కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కొత్త సత్తయ్య, గడ్డం శ్రీనివాస్, చుంచు సదానందం, సురేంద్ర ఉపాధ్యాయ, నిశాంత్ గాంధీ, తుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్‌లో న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Tags:    

Similar News