Jonathan Tortoise: భూమిపై నడుస్తున్న వృద్ధ జీవి...వయసు తెలిస్తే షాకవుతారు
Jonathan Tortoise: భూమిపై నడుస్తున్న వృద్ధ జీవి...వయసు తెలిస్తే షాకవుతారు ప్రపంచంలోనే అత్యధిక వయసున్న 193 ఏళ్ల వృద్ధ తాబేలు జోనాథన్ మరణించిందనే వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
Jonathan Tortoise భూమిపై నడుస్తున్న వృద్ధ జీవి...వయసు తెలిస్తే షాకవుతారు
Jonathan Tortoise: ప్రపంచంలోనే అత్యధిక వయసున్న 193 ఏళ్ల వృద్ధ తాబేలు జోనాథన్ మరణించిందనే వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే, ఈ వార్తలు కేవలం పుకార్లేనని కొట్టిపారేసింది సెయింట్ హెలెనా ప్రభుత్వం. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ఎలా మొదలైంది ఈ గందరగోళం?
ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఒక తప్పుడు పోస్టు వైరల్ అయింది. జోనాథన్ సంరక్షణ బాధ్యతలు చూసుకునే వెటర్నరీ డాక్టర్ జో హాలిన్స్ పేరుతో ఉన్న ఒక ఎక్స్ ఖాతా నుంచి “జోనాథన్ మరణించింది” అని పోస్ట్ చేశారు. ఇలా పోస్టైన కొన్ని గంట్ల్లోనే దాదాపు ఈ పోస్టును 20 లక్షల మంది చూశారు. చాలా మంది ఇది నిజమేమో అనుకొని షేర్ చేయడంతో గందరగోళం మరింత పెరిగింది. ఈ గందరగోళాన్ని గమనించిన సెయింట్ హెలెనా కమ్యూనికేషన్స్ హెడ్ అనీ డిల్లాన్... ఇది కేవలం పుకార్లేనని, ఏప్రిల్ ఫూల్స్ జోక్ మాత్రమేనని స్పష్టం చేశాడు. దీంతో జొనాథన్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
జోనాథన్ ప్రత్యేకత ఏమిటి?
సాధారణంగానే భూమిపై నివశించే తాబేళ్లు వందసంవత్సరాలకు పైగా బతుకుతాయి. కానీ, జొనాథన్ అంతకు మించి అన్నట్టుగా 193 సంవత్సరాల పాటు జీవించింది. ఇంకా సజీవంగా ఆరోగ్యంగా ఉండటం విశేషం. దీంతో ఈ తాబేలు ప్రపంచంలోనే అత్యంత వృద్ధజీవిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కెక్కింది. 1882లో ఈ తాబేలును సెయింట్ హెలెనా ద్వీపానికి తీసుకొచ్చారు. ఇలా ఈ ద్వీపానికి వచ్చేటప్పటికే దీని వయసు సుమారు 50 ఏళ్లు ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం జొనాథన్ 19వ శతాబ్ధం ప్రారంభంలో జన్మించి ఉండొచ్చని చెబుతున్నారు. ఇంతకాలం పాటు జీవించిన జొనాథన్ ఎన్నో చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచింది. ప్రపంచ యుద్ధాలు, రాజకీయ మార్పులకు సాక్షిగా నిలిచింది. ప్రశాంతమైన వాతావరణంలో ఉండటమే అత్యధికకాలం జీవించడానికి కారణంగా చెబుతున్నారు.
ఎక్కడ ఉంది జోనాథన్?
అట్లాంటిక్ మహాసముద్రంలో సెయింట్ హెలెనా అనే చిన్న ద్వీపంలో ఈ జొనాథన్ నివసిస్తోంది. ఈ ద్వీపం చారిత్రకంగా కూడా ప్రసిద్దిపొందింది. ప్రముఖ చరిత్రకారుడు సైనాధికారి నెపోలియన్ బోనపార్టేను నిర్భంధించిన ప్రదేశంగా పేరుగాంచింది. ప్రస్తుతం జొనాథన్ గవర్నర్ కార్యాలయంలోని గార్డెన్‌లో ప్రత్యేక సంరక్షణలో జీవిస్తున్నది. ఈ కార్యాలయంలోని సిబ్బంది దానికి ప్రత్యేకమైన ఆహారం, వైద్యసేవలు, సంరక్షణ బాధ్యతలు అందిస్తున్నారు.
ఎందుకు ఈ వార్త అంత వైరల్ అయింది?
దీనికి రెండు కారణాలున్నాయి. ఇందులో ఒకటి జోనాథన్ లాంటి అరుదైన జీవిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉండటం. ఈ తాబేలుకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు. జోనాథన్‌కి సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు. ఇక రెండోది ఏప్రిల్ ఫూల్స్‌డే సందర్భంగా తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మం. ఈ రెండు కారణాల వలన ఈ వార్త వైరల్ అయింది. మొత్తంగా చూసుకుంటే 193 ఏళ్ల జోనాథన్ ఇంకా సజీవంగానే ఉంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతీ వార్తను నమ్మే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోంది.