Giddalur: నల్లమల ఘాట్ రోడ్డులో లారీ బోల్తా.. నిలిచిన ట్రాఫిక్!

Giddalur: గిద్దలూరు నంద్యాల ఘాట్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం తప్పింది. నల్లమల అటవీ ప్రాంతంలోని మహానంది పరిధిలో లారీ బోల్తా పడటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

Update: 2026-05-10 08:48 GMT

Giddalur: నల్లమల ఘాట్ రోడ్డులో లారీ బోల్తా.. నిలిచిన ట్రాఫిక్!

గిద్దలూరు: మార్కాపురం జిల్లా,గిద్దలూరు సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో, నంద్యాల సరిహద్దు మహానంది పరిధిలో లారీ బోల్తాపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఘాట్ రోడ్డులో పెద్ద వాహనాలు అటు ఇటు వెళ్లేందుకు వీలు లేక అటు ఇటు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దిగువమెట్ట ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు, అటవీ శాఖ అధికారులు వాహనాలను నిలిపివేశారు. బోల్తాపడిన లారీని తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాహనాల రాకపోకలు పునరుద్ధరించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News