Markapuram: గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన మార్కాపురం చిన్నారులు!

Markapuram: మార్కాపురం పట్టణానికి చెందిన సురభి సోనిత్, సురభి మోక్ష అన్నాచెల్లెళ్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించి పట్టణానికి గర్వకారణంగా నిలిచారు.

Update: 2026-05-10 10:50 GMT

Markapuram: గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన మార్కాపురం చిన్నారులు!

మార్కాపురం: మార్కాపురం పట్టణానికి చెందిన సురభి మహేష్ కుమార్, గ్లాడిస్ దంపతుల పిల్లలు సురభి సోనిత్, సురభి మోక్ష గిన్నిస్ వరల్డ్ రికార్డు ధ్రువపత్రాలు అందుకొని పట్టణానికి గర్వకారణంగా నిలిచారు. గత ఫిబ్రవరి 2న విజయవాడలో నిర్వహించిన భారీ సంగీత కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 22 దేశాలకు చెందిన దాదాపు 2 వేల మంది కీబోర్డ్ వాయిద్యకారులు ఒకేసారి ప్రదర్శన ఇచ్చారు. ఈ అద్భుత సంగీత ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నమోదైంది.

ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన 777 మంది విద్యార్థులకు తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డు ధ్రువపత్రాలను అందజేశారు. హల్లెల్ మ్యూజిక్ స్కూల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వ్యవస్థాపకుడు ఆగస్టిన్ దండంగి చేతుల మీదుగా చిన్నారులు ఈ ధ్రువపత్రాలు అందుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లు ఇద్దరూ గిన్నిస్ రికార్డు సాధించడం విశేషమని స్థానికులు అభినందిస్తున్నారు. తమ పిల్లలు చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. సంగీతంపై ఆసక్తి, క్రమశిక్షణతో సాధన చేస్తే మరిన్ని విజయాలు సాధిస్తామని చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News