Kurnool: కర్నూలులో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు
Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Kurnool: కర్నూలులో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు
Kurnool: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS P.O డాక్టర్ ఎస్. నాగ స్వామి నాయక్ మాట్లాడుతూ, టంగుటూరి ప్రకాశం పంతులు గారు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ధైర్యసాహసాలతో పోరాడిన మహోన్నత నాయకుడని అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో దేశభక్తి, స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.
ఆంధ్రకేసరి గా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రకాశం పంతులు గారి జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు, ప్రజాసేవా దృక్పథం, నిస్వార్థ నాయకత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తాయని తెలిపారు. విద్యార్థులు కూడా క్రమశిక్షణ, నిజాయితీ, దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు.
అనంతరం సిబ్బంది మాట్లాడుతూ, ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్రను, స్వాతంత్ర్య సమరంలో ఆయన పోషించిన పాత్రను విద్యార్థులకు వివరించారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మల్లికార్జున, విజయశేఖర్, కృష్ణమోహన్, రామకృష్ణ, సోమేష్, శారధి పటేల్, చిన్న మల్లేష్, ఉల్గోజి రావు, శ్రీధర్ మూర్తి తదితర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ప్రకాశం పంతులు గారికి ఘన నివాళులు అర్పించారు.