Kurnool: కర్నూలు జిల్లాలో సాగు కంటే తాగునీటికే తొలి ప్రాధాన్యం!

Kurnool: ఎలినో ప్రభావంతో కర్నూలు జిల్లాలో సాగు కంటే తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు నీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఎల్‌ఎల్‌సి చైర్మన్ తెలిపారు.

Update: 2026-08-22 11:24 GMT

Kurnool: కర్నూలు జిల్లాలో సాగు కంటే తాగునీటికే తొలి ప్రాధాన్యం!

Kurnool: ఎలినో ఎఫెక్ట్ ద్వారా ఈ ఏడాది సాగునీటిని తక్కువగా ఉపయోగించి త్రాగు నీటి వినియోగం కోసం ప్రాధాన్యత ఇవ్వబోతున్నాని ఎల్ ఎల్ సి చైర్మన్ టిప్పు సుల్తాన్ తెలిపారు.కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఖరీఫ్ (2026-27)కు సంబంధించి జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి,ఆలూరు నియోజవర్గం ఇంచార్జీ వైకుంఠం జ్యోతి,జిల్లా అధికారులు పాల్గొన్నారు.

టీబీ డ్యాం నుంచి కర్నూలు జిల్లాకు 12టీఎంసీల నీటిని కేటాయించారని సాగుకు, త్రాగు నీటి కోసం మేము ప్రతిపాదన పంపించమని పంట వేసిన రైతులు నష్టపోకుండా అదనంగా నీటిని కేటాయించాలని ఇటీవలే విజయవాడలో రాష్ట్ర మంత్రిని కోరామని జిల్లా ప్రజాప్రతినిధులు,అధికారులు ఇచ్చిన సూచనలు మేరకు జిల్లాలోని రైతులు ప్రజలు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని టిప్పు సుల్తాన్ తెలిపారు.

ఈ ఏడాది వర్షాలు పడకపోవడంతో త్రాగు నీటికి కూడా ఇబ్బంది పడాల్సివస్తుందడని hnss ద్వారా 3వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని వాటిని హంద్రీ నదిలోకి విడుదల చేస్తే ఎనిమిది గ్రామాల ప్రజలకు త్రాగు నీటి సమస్య పరిష్కారం చేయడానికి వీలుగా ఉందని పంటలు వేసుకున్న రైతులను ఆదుకోవాలని జిల్లా అధికారులను కోరినట్లు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News