Markapuram: దళితులకు తాగునీటి తిప్పలు పైప్‌లైన్ కట్ చేశారంటూ ఆవేదన!
Markapuram: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం పోతంపల్లిలో దళితులకు తీరని తాగునీటి ఎద్దడి. సాగర్ ట్యాంక్ పైప్‌లైన్ కట్ చేసి నీరు మళ్లిస్తున్నారని ఆరోపణ.
Markapuram: దళితులకు తాగునీటి తిప్పలు పైప్‌లైన్ కట్ చేశారంటూ ఆవేదన!
Markapuram: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం పోతంపల్లి గ్రామంలో దళితులకు తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. సాగర్ ట్యాంక్ నుంచి తమకు రావాల్సిన నీటిని కొందరు అడ్డుకుంటున్నారని దళితులు ఆరోపిస్తున్నారు.
సాగర్ ట్యాంక్‌కు వచ్చే పైప్‌లైన్‌ను కట్ చేసి, ట్యాంక్ నుంచి కాకుండా మెయిన్ లైన్ నుంచి పాలెం వైపు నీటిని మళ్లించారని చెబుతున్నారు. అక్కడ వాల్ ఏర్పాటు చేసి తమ ప్రాంతానికి నీరు రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నీటి సరఫరాను పునరుద్ధరించి, పైప్‌లైన్ సమస్యను వెంటనే పరిష్కరించాలని దళిత కుటుంబాలు అధికారులను కోరుతున్నాయి.