Srisailam: శ్రీశైలంలో తిరుమల తరహా విఐపి దర్శన విధానం!
Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయంలో విఐపి, వివిఐపి దర్శనాలకు వాట్సాప్ లింక్, ఓటీపీ విధానం. తిరుమల తరహా నూతన సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టిన అధికారులు.
Srisailam: శ్రీశైలంలో తిరుమల తరహా విఐపి దర్శన విధానం!
Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల రద్దికి అనుగుణంగా స్వామివారి స్పర్శ దర్శనాలలో దేవస్థానం అధికారులు పెను మార్పయ చేశారు సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పిస్తూనే విఐపిలకు వివిఐపిలకు ప్రోటోకాల్ దర్శనాలలో దేవస్థానం అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తిరుమల తిరుపతి తరహాలో శ్రీశైలం దేవస్థానంలో కూడ విఐపిల వివిఐపిలకు ప్రత్యేక సాఫ్టవేర్ ను రూపొంచి ఆన్ లైన్ ఓటిపి సిస్టమ్‌ను అమలులోకి తీసుకొచ్చామని ఈఓ శ్రీనివాసరావు చైర్మన్ రమేష్ నాయుడు వెల్లడించారు
అయితే స్వామివారి దర్శనాల సమయంలో మార్పులు చేస్తూ సాధారణ భక్తులకు విడతలవారీగా విఐపిలకు మరో టైమ్ కేటాయిస్తూ ఎవరికి ఇబ్బందులు కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు అంతేకాకుండా ఆన్ లైన్ సిస్టం లొ ఓటిపితో డైరెక్ట్ గా సెల్ ఫోన్ లోనే టికెట్లు అందుబాటులోకి వచ్చే విధంగా నూతన విధానం ప్రవేశపెట్టారు.
దీనితో విఐపిలు వివిఐపిలు టికెట్లు కోసం కౌంటర్ల వద్ద వేచి ఉండకుండా డైరెక్ట్ గా వారి సెల్ఫోన్ లోనే టికెట్లు ప్రత్యక్షమయ్యే విధంగా నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు
ఆలయ క్యూలైన్లలో భక్తులు గంటల కొద్ది వేచి ఉండకుండా
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో దేవాదాయశాఖ ఆద్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వేరువేరు సమయాలలో విడుతలవారిగా స్వామివారి స్పర్శ దర్శనాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని దర్శనాల క్యూలైన్లలో ఎటువంటి తోపులాటలు జరగకుండా ప్రశాంతంగా క్యూలైన్లు నుంచి భక్తులు సాఫీగా ఆలయంలోకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారని ఈఓ శ్రీనివాసరావు చైర్మన్ రమేష్ నాయుడు తెలిపారు
అయితే విఐపిలకు వివిఐపిల లెటర్లు నలబై ఎనిమిది గంటలు ముందుగా శ్రీశైలం దేవస్థానం ప్రోటోకాల్ విభాగానికి పంపించగలిగితే శ్రీశైలం దేవస్థానం సిబ్బంది నేరుగా విఐపిల వాట్సప్ నంబర్లకు టికెట్లతో కూడిన లింకును పంపడం జరుగుతుందని ఆ లింక్ ను ఓపెన్ చేసి ఓటిపి ద్వారా ఫోన్ లో కాని గూగుల్ పే లో గాని టికెట్లు నగదును ట్రాన్సపర్ చేయటం వల్ల డైరెక్ట్ గా టికెట్లు వారికి వాట్సప్ లో ప్రత్యక్షమవుతాయని ఆ తరువాత భక్తులు శ్రీశైలం వచ్చేందుకు ప్లాన్ చేసుకుని శులభంగా స్లాట్ పద్దతిలో స్వామివారి దర్శనం చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు
సామాన్య భక్తుల దర్శనాల సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా విఐపిలకు వివిఐపిలకు ప్రత్యేక టైమ్ స్లాట్ పద్దతిని అందుబాటులో తెచ్చినట్లు ఈఓ శ్రీనివాసరావు చైర్మన్ రమేష్ నాయుడు వెల్లడించారు ఇక నుంచి శ్రీశైలం మల్లన్న భక్తులకు ఆన్ లైన్ లోనే టికెట్లు అందుబాటులో ఉండేందు అన్ని ఏర్పాట్లు చేశారు భక్తులు ఈ మార్పులు గమనించి సహకరించాలని కోరారు.