Kurnool: కోడుమూరులో 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం!

Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొని, సమస్యలు తెలుసుకున్నారు.

Update: 2026-08-26 07:22 GMT

Kurnool: కోడుమూరులో 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం!

Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో నిర్వహించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో పర్యటిస్తూ ప్రజలను నేరుగా కలుసుకున్నారు.

ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో తాగునీరు, పింఛన్లు, రేషన్, అమ్మ ఒడి పథకాలు అందుతున్నాయ అని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు.ప్రజలు తీసుకొచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండేలా పాలన సాగిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

Tags:    

Similar News