Prakasam: పోలీస్ శాఖలో తీవ్ర విషాదం: ప్రకాశం జిల్లా డీఎస్పీ వేలమూరి శ్రీరామ్ కన్నుమూత!
Prakasam: ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. డీఎస్పీ వేలమూరి శ్రీరామ్ గారు ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ప్రకాశం జిల్లా: పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. డీఎస్పీ వేలమూరి శ్రీరామ్ గారు గురువారం (11-06-2026) తెల్లవారుజామున సుమారు 1.30 గంటల సమయంలో ఒంగోలులోని KIMS Hospital లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వారి మరణవార్త పోలీస్ శాఖతో పాటు స్నేహితులు, శ్రేయోభిలాషులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన శ్రీరామ్ గారి సేవలను పలువురు స్మరించుకుంటున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.