మార్కాపురంలో బాలయ్య బర్త్‌డే సంబరాలు: నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకల్లో అభిమానుల కోలాహలం!
హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలు ప్రకాశం జిల్లా మార్కాపురంలో అభిమానుల ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగాయి.
మార్కాపురంలో బాలయ్య బర్త్‌డే సంబరాలు: నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకల్లో అభిమానుల కోలాహలం!
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలు మార్కాపురంలో అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మోక్షజ్ఞ ఆర్గనైజర్ సోమిశెట్టి రామచంద్రయ్య నేతృత్వంలో, మాస్టర్ నవీన్ కుమార్ పర్యవేక్షణలో నెహ్రూ బజార్‌లోని స్టైల్ డ్యాన్స్ అకాడమీలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ సినీ పాటలకు చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ వక్కలుగడ్డ రాధిక మల్లికార్జున్ చిన్నారుల ప్రతిభను అభినందిస్తూ, ఉత్తమ ప్రదర్శనలు చేసిన వారికి బహుమతులు అందజేశారు.
బాలయ్య అభిమానుల జైజై ధ్వానాలతో, కేక్ కటింగ్, పాటలు, నృత్యాలతో వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ సందర్భంగా అభిమానులు బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో పాటు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో అభిమానులు, యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.