Markapuram: అనుమానం పెనుభూతం.. భార్యను అత్యంత కిరాతకంగా చంపిన భర్త!
Markapuram: మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో దారుణం. అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త.
Markapuram: అనుమానం పెనుభూతం.. భార్యను అత్యంత కిరాతకంగా చంపిన భర్త!
మార్కాపురం జిల్లా: అనుమానంతో భార్యను అతికిరాతకంగా గొడ్డలితో నరికి హత మార్చిన భర్త ఈ సంఘటన మండలంలోని సర్వేరెడ్డి పల్లి గ్రామంలో జరిగింది. అనుమానంతో బహిర్భూమికి వెళ్లిన జ్యోతిని భర్త వెంబడించి మరీ గొడ్డలితో కిరాతకంగా నరికి హతమార్చాడు. తర్వాత సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. సర్విరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పందిటి మరియ జ్యోతి(32)కి గిద్దలూరు మండలం ఏబీఏం పాలని కి చెందిన దావీదుతో 20 సంవత్సరాల క్రితం పెద్దలు వివాహం జరిపించారు.
వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్దాలతో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంగా పుట్టింట్లో ఉన్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త బుధవారం తెల్లవారుజామున హత్య చేసేందుకు గొడ్డలి సిద్ధం చేసుకున్నాడు.
భార్య తన చెల్లితో కలిసి గ్రామ సమీపంలోని నిర్మానుష ప్రదేశంలో బహిర్భూమిలో వెళ్ళింది. అదే అదునుగా సమయం చూసుకున్న దావీదు భార్యను వెంబడించి గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. సీఐ రామకోటయ్య సంఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.