Kurnool: అప్రమత్తంగా ఉండండి.. పోలీసులకు సహకరించండి.. కర్నూలు ఎస్పీ
Kurnool: కర్నూలు జిల్లాలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ ముమ్మరం చేశారు.
Kurnool: అప్రమత్తంగా ఉండండి.. పోలీసులకు సహకరించండి.. కర్నూలు ఎస్పీ
Kurnool: జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేరాల నియంత్రణతో పాటు అనుమానాస్పద వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.
శనివారం రాత్రి నుండి తెల్లవారు జాము వరకు కర్నూలు మూడవ పట్టణ సీఐ శేషయ్య ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలో ప్రత్యేక విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. బ్లూ కోల్ట్స్ బృందాలు మరియు క్యూఆర్టీ పోలీసు బృందాలు పాల్గొని కట్టుదిట్టంగా విజిబుల్ పోలీసింగ్ చేపట్టాయి.
రహదారి ప్రమాదాల నివారణకు “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఎక్కడైనా సమస్యలు ఉంటే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112 /100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.