Kurnool: మెగా కార్డన్ & సెర్చ్‌తో వణికిపోయిన అసాంఘిక శక్తులు!

Kurnool: కర్నూలు జిల్లా రచ్చుమర్రి గ్రామంలో 'ఆపరేషన్ వజ్రప్రహార్' పేరుతో పోలీసులు మెగా కార్డన్ & సెర్చ్ నిర్వహించారు.

Update: 2026-05-02 08:50 GMT

Kurnool: మెగా కార్డన్ & సెర్చ్‌తో వణికిపోయిన అసాంఘిక శక్తులు!

Kurnool: కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని రచ్చుమర్రి గ్రామంలో ఎమ్మిగనూరు డిఎస్పి శ్రీమతి ఎం.ఎన్. భార్గవి గారి ఆధ్వర్యంలో మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ మద్యం , గుట్కా నిల్వలు మరియు అనుమానిత ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు.

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

తనిఖీల్లో భాగంగా పత్రాలు లేని 12 మోటార్ సైకిళ్లు, నంబర్ ప్లేట్లు లేని 8 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సాగు, నాటుసారా తయారీపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిఐలు దస్తగిరి, మంజునాథ్, ఎస్సైలు పాల్గొన్నారు.

Tags:    

Similar News