Srisailam: నల్లమలలో ఉద్రిక్తత ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శన నిలిపివేత
Srisailam: శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతంలోని ఇష్టకామేశ్వరి ఆలయానికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Srisailam: నల్లమలలో ఉద్రిక్తత ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శన నిలిపివేత
Srisailam: నాగార్జునసాగర్ - శ్రీశైలం పెద్దాపురం అభయారణ్యం నల్లమలలోని అరుదైన విశిష్ట ఇష్టకామేశ్వరి ఆలయానికి భక్తులను చేరవేసే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు ఇబ్బందుల పాలయ్యారు. భక్తుల మనసులో కోరికలను నెరవేర్చే ఇష్ట దైవం ఇష్టకామేశ్వరి అమ్మవారిని సేవిస్తే సకల ఇష్టాలు నెరవేరుతాయిని భక్తుల విశ్వాసం. శ్రీశైల శిఖరేశ్వరం నుంచి పది కిలోమీటర్ల నల్లమల అటవీ ప్రాంతంలో ఇష్టకామేశ్వరి ఆలయానికి భక్తులను అటవీశాఖ అనుమతించిన వాహనాల్లో నిర్దేశిత వసుమ తీసుకొని అటవీ మార్గంలోకి అనుమతిస్తారు.
ఈ క్రమంలో భక్తులను కమాండర్ జీపుల్లో చేరవేసే డ్రైవర్లకు అటవీ శాఖ సిబ్బంది మధ్యన ఘర్షణ తలెత్తింది. పరస్పరం ఆరోపణలు ఘర్షణల మధ్య సతమతమైన భక్తులు అమ్మవారి దర్శనానికి వెళ్లలేక పోయారు. గత కొంతకాలంగా ఇక్కడి వాహన డ్రైవర్ల పెత్తనం, అజమనిషి, దౌర్జన్యాలు పెచ్చుమీరి ఇష్టకామేశ్వరి భూగర్భ ఆలయం తమ ఆధీనంలో ఉండేలా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఈ సమస్యపై ఎన్ ఎస్ టి ఆర్ ఫీల్డ్ డైరెక్టర్ రాష్ట్ర అటవీ శాఖ పిసిసిఎఫ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దృష్టికి తీసుకు వెళ్లి ఫిర్యాదు చేశారు.
స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో ఈ దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లాలంటే అటవీశాఖ ఆన్లైన్ ద్వారా నెక్కంటి జంగిల్ రైడ్ వెబ్సైట్లో ముందస్తుగా టికెట్లు పొందాలి. దేశంలోనే అతిపెద్ద పెద్ద పులుల సంరక్షణ అభయారణ్యం నల్లమల లోని నాగార్జునసాగర్ - శ్రీశైలం అభయారణ్యం. ఈ అభయారంగంలోనే ఇష్టకామేశ్వరి ఆలయం ఉంది. అటవీశాఖ నిబంధనలను భక్తులు, వాహన డ్రైవర్లు పాటించాల్సి ఉంది.
కానీ ఓ తెగకు చెందిన సమూహం అడవి అడవిలోని ఆలయంపై హక్కు మాదని మమ్ములను నియంత్రించే అధికారం ఎవరికి లేదంటూ గతంలో పలుమార్లు ఘర్షణలకు పాల్పడ్డారు. నెక్కంటి జంగిల్ రైడ్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు నల్లమల మీదుగా భక్తుల వాహనాలు వేగంగా వెళుతూ విపరీతమైన సౌండ్ హారన్లు మోగిస్తూ వన్యప్రాణుల సంచారానికి ఆటంకాలు కల్పించడంతో అడవి శాఖ సీరియస్ గా మండలించింది. ఈ సమూహంలోని కొందరు ఇష్టకామేశ్వరి ఆలయ నిషేధిత అటవీ ప్రదేశాల్లో అనుమానంగా సంచరించే అసాంఘిక శక్తులకు సహకరిస్తున్నారనే పలు విమర్శలు ఉన్నాయి.
అటవీ శాఖ చట్టాలను ఉల్లంఘిస్తున్న వాహన డ్రైవర్ల పై అటవీశాఖ చట్టపరమైన చర్యలకు సిద్ధపడింది. ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు తాత్కాలికంగా ఇష్టకామేశ్వరి ఆలయానికి భక్తుల రాకపోకలను అటవీశాఖ నిలిపివేసింది. ప్రైవేట్ వాహనాల డ్రైవర్ల దురుసుతనం వల్ల ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకునే భాగ్యంలేక వెను తిరగవలసి వచ్చిందని నంద్యాల జిల్లాకు చెందిన 8 మంది భక్తులు వాపోయారు.