Khammam: ఖమ్మంలో దారుణం త్రీటౌన్ ప్రాంతంలో యువకుడి కత్తిపోట్ల హత్య!

Khammam: త్రీటౌన్ పరిధిలో శ్రీనాథ్ (24) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి ముందు మూత్రవిసర్జన విషయమై తలెత్తిన చిన్నపాటి వివాదం ఈ హత్యకు దారితీసింది.

Update: 2026-08-14 04:20 GMT

Khammam: ఖమ్మంలో దారుణం త్రీటౌన్ ప్రాంతంలో యువకుడి కత్తిపోట్ల హత్య!

Khammam: ఖమ్మం నగరంలోని త్రీ టౌన్ ప్రాంతంలో యువకుడి దారుణ హత్య. శ్రీనాథ్ (24) అనే యువకుడిని కత్తితో పొడిచి పొడిచి హత్య చేసిన ఓ వ్యక్తి. రంగనాయకుల గుట్ట సమీపంలో ఓ కాలువలో విగత జీవిగా పడి ఉన్న శ్రీనాథ్ ను చూసి ఆసుపత్రికి తరలింపు

అప్పటికే మృతి చెందాడని తెలిపిన వైద్యులు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరారీలో నిందితుడు మధు. గురువారం అర్ధరాత్రి సమయంలో మధు అనే యువకుడు తన ఇంటి బయట మూత్ర విసర్జన చేస్తుండగా,అప్పటికే తప్పతాగి ఉన్న శ్రీనాధ్ తన ఇంటి ఎదుట మూత్రం పోస్తున్నవెందుకు అనే విషయంలో ఇరువురి మధ్య వివాదం నెలకొంది.

ఈ వివాదంతో శ్రీనాధ్ సెంట్రింగ్ కర్రతో మధు తలపై మోదాడని, తర్వాత ఇంట్లోకి వెళ్లిన మధు తిరిగి కత్తి పట్టుకొని వచ్చి శ్రీనాధ్ ను విచక్షణ రహితంగా కత్తితో పొడిచడాని స్థానికులు తెలిపారు.

మధు వడ్డెర కూలి కాగా,శ్రీనాధ్ పెండ్లిలకు డెకరేషన్ వర్కర్ గా పని చేస్తారు. మధు పరారీలో ఉన్నారు. శ్రీనాధ్ డెడ్ బాడీని ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ మార్చరీకి తరలించారు.

Tags:    

Similar News