Kukunoor: చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు - నలుగురు అరెస్ట్!
Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరులో మహిళ మెడలో బంగారు నానుతాడు ఎత్తుకెళ్లిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, కారు, బంగారం స్వాధీనం చేసుకున్న ఎస్సై రాజారెడ్డి.
Kukunoor: చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు - నలుగురు అరెస్ట్!
Kukunoor: దొంగతనం కేసును కుక్కునూరు పోలీసులు ఛేదించారు. నిందితులు చోరీకి ఉపయోగించిన వాహనాన్ని, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరులతో సమావేశంలో వివరాలను కుక్కునూరు ఎస్సై కె. రాజారెడ్డి వెల్లడించారు. కుక్కునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వింజరం గ్రామంలో ఈనెల తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ట్స్ 03ET 4530 నంబర్ గల కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు,
ఓ ఆడ మనిషి ఆ కారును రోడ్డు పక్కన నడిచి వెళుతున్న మహిళకు అడ్డుగా ఆపి ఆ మహిళను కొట్టి భయభ్రాంతులకు గురిచేసి ఆ మహిళ మెడలో ఉన్న బంగారు నాన్తాడును లాక్కొని బూర్గంపాడు వైపు పారిపోయారని బాధితురాలు కుక్కునూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని దర్యాప్తులో భాగంగా నిందితులు పారిపోయే క్రమంలో నిందితులు ప్రయాణిస్తున్న కారు వెంకటాపురం గ్రామం తిమ్మంపేట రోడ్డువైపు వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది.
దీంతో కారు ముందు ఎడమ వైపు టైరు డ్యామేజ్ అవడంతో నిందితులు కారును సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దాచిపెట్టి, అక్కడి నుండి పారిపోయే ప్రయత్నంలో వెంకటాపురం గ్రామ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో నిందితులను వెంకటాపురం క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నామని ముద్దాయిలైన
షేక్ ఖాసిం (26) పేరున
జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్
పరిధిలో 13 కేసులు, అందులో 1 హత్య కేసు, కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, నల్లజర్ల పోలీస్ స్టేషన్
పరిధిలో 1 కేసు, మొత్తం17 కేసులు ఉన్నాయని,
వాసంశెట్టి రామచంద్ర పవన్ కుమార్ (19) పేరున
జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్
పరిధిలో 9 చోరీ కేసులు, అందులో 1 హత్య కేసు, కొయ్యలగూడెం
పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు , మొత్తం 10 కేసులు, నలుబోలు లోకేష్ (27) పేరున
జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్
పరిధిలో 3 కేసులు ఉన్నాయని, పాయం రుతు ఎటువంటి కేసులు నమోదయి ఉండలేదని ఇదే మొదటి కేసు నమోదు చేశామని, నిందితుల వద్ద ఉన్న బాధితురాలి బంగారు నానుతాడు మరియు నేరానికి ఉపయోగించిన వాహనం స్వాధీనం చేస్తున్నామని,నిందితులను రిమాండ్ నిమిత్తం జంగారెడ్డిగూడెం కోర్టు హాజరు పరుస్తామని కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.
కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించి త్వరితగతిన నిందితులను పట్టుకొని వారి వద్ద నుంచి దొంగిలించిన నాన్ తాడు మరియు నేరానికి ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్న కుక్కునూరు సీఐ పి.బాల సురేష్ బాబు, ఎస్ ఐ కె.రాజారెడ్డిని పోలీస్ సిబ్బందిని ఏలూరు జిల్లా ఎస్పీ అభినందించారు.