Kothagudem: కవిత పాంచ జన్య సూత్రాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తాం
Kothagudem: కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగ విజయవంతానికై జిల్లా అధ్యక్షుడు వీరన్న అధ్యక్షతన ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించారు.
Kothagudem: కవిత పాంచ జన్య సూత్రాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తాం
కొత్తగూడెం: కల్వకుంట్ల కవిత పాంచ జన్య సూత్రాలను (ఐదు హామీలను) ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తాం. జెండా పండుగను జిల్లాలో విజయవంతం చేస్తాం. కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగ విజయవంతానికై పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరన్న అధ్యక్షతన ముఖ్య నాయకుల సన్నాక సమావేశం. ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర పరిశీలకులు,జి.నవీన్ కుమార్, భావన్నాయక్.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరన్న మాట్లాడుతూ.. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో, 119 నియోజకవర్గాల్లో ఈనెల 26వ తారీకు నుంచి వచ్చే నెల 20వ తారీకు వరకు జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క పంపిన రాష్ట్ర పరిశీలకుల సూచనలు సలహాలను పాటిస్తూ జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో తాము గుర్తించిన 22 మండలాల్లోని 97 గ్రామాల్లో జెండా పండుగను విజయవంతం చేస్తామని తెలిపారు.
కవితక్క పాంచజన్య సూత్రాలైన ఉచిత విద్య, వైద్యం,ఉద్యోగాలు, వ్యవసాయం, సామాజిక న్యాయం అమలు కోసం జిల్లాలో గ్రామ గ్రామాన, గడపగడపకు వెళ్ళి విస్తృత ప్రచారం చేస్తామని వివరించారు. బీ ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా పరిపాలన సాగించిన నేపథ్యంలో భౌగోళిక తెలంగాణ వచ్చినప్పటికీ.. సామాజిక తెలంగాణ రాలేదని విమర్శించారు.
తెలంగాణలోని సబ్బండ వర్గాలు, కార్మికులు,మహిళలు, యువకులు ఏ ఆశలతో అయితే తెలంగాణ సాధించుకున్నారో నీళ్లు, నిధులు ,నియామకాలు నెరవేరలేదని కంఠశోష పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో రాష్ట్రంలో సామాజిక తెలంగాణ ధ్యేయంగా సబ్బండ వర్గాలకు న్యాయం చేసే విధంగా తెరసే కృషి చేస్తుందని తెలిపారు. పార్లమెంట్ గడప కాదు కదా పంచాయతీ గడప కూడా తొక్కని,దక్కని కులాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. వారందరికీ రాజ్యాధికార దిశగా, రాజకీయ అవకాశాలు రావాలని కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీని ఏర్పాటు చేసిందన్నారు.
56 శాతం బీసీలున్న ఈ రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్ లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని దానిని అమలు చేయాలని, మూడు బిల్లులను విద్యా పరంగా, రాజకీయపరంగా, ఉద్యోగాలలో అవకాశాలు కల్పించేందుకు అసెంబ్లీలో, పార్లమెంట్లో చట్టాలు చేయాలని కల్వకుంట్ల కవిత వెంటపడి పోరాడుతున్నారని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి అంటే బీసీలు, భహుజన వర్గా అభివృద్ధి అని, వారు అభివృద్ధి కాకుండా తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదని కల్వకుంట్ల కవిత ముందుకు వెళ్తున్నారని, అందులో భాగంగానే గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న తెలంగాణ జాగృతి సంస్థ మరింత ప్రజలకు చేరువ కావాలని, ప్రజలకు సేవలు అందించాలనే ధ్యేయంతో రాజకీయ పార్టీ వల్లనే అది సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీగా ఏప్రిల్ 25వ తేదీన పెద్ద ఎత్తున ఆవిర్భావం చేయడం జరిగిందన్నారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి సామాజిక న్యాయమే లక్ష్యంగా పాంచజన్య సూత్రాలు,ఐదు హామీలతో కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీని ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు విద్య పరంగా వైద్య పరంగా అధికంగా ఖర్చవుతున్నదని, తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలందరికీ ఉచితంగా విద్య, వైద్యం, వ్యవసాయం పరంగా సహకారం అందించాలని, సామాజిక న్యాయం, యువతి యువకులకు తెలంగాణ ఉద్యమకారులకు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ జన్య సూత్రాలు ఐదు హామీలు అమలు చేస్తామని తెలిపారు.
అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన జెండా పండుగలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు నియోజకవర్గ కేంద్రాలతో పాటు 22 మండలాలల్లో గుర్తించిన 97 గ్రామాల్లో జెండా పండుగ కార్యక్రమాలను విజయవంతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్చార్జి లతో పాటు నియోజకవర్గ ఇన్చార్జిలు వాసం రామకృష్ణ దొర, సోడె వెంకన్న ,భీమ్రావు రాంజీ , పృధ్వి, పమ్మి జగదీష్, విద్యార్థి విభాగం జిల్లా నా అధ్యక్షులు లకావత్ సురేష్, నరేష్ విజయ్ కార్మిక ,మహిళ, ఆటో విభాగం జిల్లా నాయకులు రాంబాబు సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.