Khammam: ఖమ్మం-కొత్తగూడెం హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

Khammam: ఖమ్మం-కొత్తగూడెం ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలడంతో అర్థరాత్రి పూట 4 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది.

Update: 2026-05-26 03:38 GMT

Khammam: ఖమ్మం-కొత్తగూడెం హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

Khammam: జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామం వద్ద ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరవడంతో రహదారికి ఇరువైపులా సుమారు నాలుగు కిలోమీటర్ల పైగా భారీగా వాహనాలు స్తంభించాయి. దీంతో సుదర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో చెట్టు మొదలు భాగంలో నిప్పు పెట్టడంతో అది పూర్తిగా కాలిపోయి, చెట్టు ప్రధాన రహదారిపై పడింది. దీంతో రోడ్డుకి ఇరువైపులా నాలుగు కిలోమీటర్ల పైగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.

అర్ధరాత్రి సమయంలో సుమారు నాలుగు గంటల పైగా రోడ్లపైనే ప్రయాణికులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కారు చీకట్లో ఒకవైపు ఉక్కు పోతా, మరోవైపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు రోడ్డుపైనే సేద తీరారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ ఐ రవి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని జెసిబి సహాయంతో సుమారు రెండు గంటలకు శ్రమించి చెట్టును రోడ్డుపై నుండి తొలగించారు. అనంతరం ట్రాఫిక్ ను క్లియర్ చేయడంతో, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News