Kamepalli: నమ్మించి కోటి రూపాయలతో పరారైన భోగ లక్ష్మీనారాయణ
Kamepalli: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని కెప్టెన్ బంజారా, బాసిత్ నగర్ గ్రామాల్లో ఘరానా మోసం వెలుగుచూసింది.
Kamepalli: నమ్మించి కోటి రూపాయలతో పరారైన భోగ లక్ష్మీనారాయణ
కామేపల్లి: అత్యాశకు పోతే మొదటికే మోసం మోసం వచ్చినట్లుంది ఆ ఊరి ప్రజలకు.... ఒకరు కాదు ఇద్దరు కాదు ఊరు ఊరు నే మోసం చేసి పరారయ్యాడు గ్రామంలో కొన్ని నెలలుగా మంచి తనంతో తిష్ట వేసి ఆ గ్రామస్తులను నమ్మించి మోసం చేసి కోటి రూపాయలతో హుడాయించాడు.
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లోని కెప్టెన్ బంజారా, బాసిత్ నగర్ తదితర గ్రామాల్లో అనేకమంది పేద గిరిజనులను బంగారం పేరుతో మోసం చేసి పరారయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా నందమూరి గ్రామానికి చెందిన భోగ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అయ్యప్ప గురు స్వామి పేరుట గ్రామంలో ఒక వ్యక్తి ద్వారా పరిచయమై ఆ గ్రామంలో పూజలు పునస్కారాలు చేయడం మొదలుపెట్టాడు.
గత తొమ్మిది నెలలుగా ఆ గ్రామంలో మంచి చెడు చూస్తూ ప్రజల్లో చెదోడు వాదోడుగా ఉంటూ అయ్యప్ప పూజా కార్యక్రమంలో అన్ని తానే ముందుండి నడిచాడు. గ్రామంలోని పేద కుటుంబాలకు చిన్నాచితక సాయం చేస్తూ మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. గ్రామంలోని ప్రజలందరినీ తన సొంత ఖర్చులతో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనంతో పాటు ఏడుపాయల దుర్గమ్మ ఆలయాలను తిప్పుతూ మంచివాడిగా పేరు తెచ్చుకున్నారు.
తన వద్ద బంగారం బిస్కెట్లు ఉన్నాయని నమ్మించి గ్రామంలోని కొంతమంది వ్యక్తుల వద్ద సుమారు కోటి రూపాయలు వరకు వసూలు చేశాడు. అదే గ్రామానికి చెందిన కుమార్,పుష్ప అనే ఇద్దరు వ్యక్తులను ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి బంగారం బిస్కెట్లు ఉన్నాయని నమ్మించాడు. కెప్టెన్ బంజరా కాకుండా పక్క గ్రామమైన బాసిత్ నగర్, వైరా తేల్దర్పల్లి,సీరోలు,కామేపల్లి తదితర గ్రామాల్లో సైతం బంగారం బిస్కెట్ల పేరుతో భోగ లక్ష్మీనారాయణ అనే బురిడీ బాబా వసూలు చేసినట్లు బాధితులు తెలుపుతున్నారు.
బంగారం తీసుకొస్తానని డబ్బులతో వెళ్లిన లక్ష్మీనారాయణ ఎంతకు తిరిగి రాకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు లక్ష్మీనారాయణ తో పాటు అతని అనుచరులుగా ఉన్న బాసిత్ నగర్ చెందిన బానోత్ కుమార్,కల్లూరు చెందిన పుష్ప సైతం కనబడకపోవడంతో బాధితులు లబోదిపోమంటూ కామేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై కామేపల్లి పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించామని మోసం చేసిన నిందితులను త్వరలోనే పట్టుకొని బాధితులకు న్యాయం చేస్తామని కారేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ సాగర్, తెలిపారు.