Bhadrachalam: భద్రాచలంలో నూతన నిత్య కళ్యాణ మండపం ప్రారంభం
Bhadrachalam: భద్రాచలం మిథిలా స్టేడియంలో కొత్తగా నిర్మించిన కళ్యాణ మండపంలో నేటి నుంచి సీతారాముల నిత్య కళ్యాణాలు ప్రారంభమయ్యాయి.
Bhadrachalam: భద్రాచలం రామాలయంలో మారిన నిత్య కళ్యాణ వేదిక
జిల్లా - భద్రాద్రి కొత్తగూడెం
రామాలయంలో నూతన నిత్య కళ్యాణ మండపం ప్రారంభం
నేటి నుంచి మిథిలా స్టేడియంలోనే సీతారాముల నిత్య కల్యాణాలు
భద్రాచలం ఆగస్టు 8 - ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరామ దివ్య క్షేత్రంలో ఈరోజు నుంచి నిత్య కళ్యాణములను ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి జరిగే మిధిల స్టేడియంలోని నూతనంగా నిర్మించిన నిత్య కళ్యాణమండపంలో ప్రారంభమయ్యాయి. రామాలయం ప్రాంగణంలోని బేడమండపంలో ఇప్పటివరకు కళ్యాణాలు నిర్వహించేవారు .శ్రీ సీతారాముల ఉత్సవ మూర్థులను ఆలయం నుంచి మంగళ మంగళవాయిద్యాలతో వేద పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా మిథిలా స్టేడియానికి తీసుకు వచ్చారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమం నిర్వహించి ఈ నూతన కళ్యాణ మండపంలో సీతారాముల నిత్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. రామాలయం అభివృద్ధి పనుల్లో భాగంగా బేడా మండపం, శ్రీ లక్ష్మీ తాయిలమ్మ వారి దేవాలయం, అద్దాల మండపం కూల్చివేశారు.