Bhadrachalam: 'సీతా' శిక్షణ తరగతులు ప్రారంభం: మూడ్రోజుల పాటు శిక్షణ!
Bhadrachalam: భద్రాచలంలో తెలంగాణ దేవాదాయ శాఖ 'SITA' ఆధ్వర్యంలో 3 రోజుల శిక్షణ తరగతులు ప్రారంభం. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల దేవాలయ సిబ్బందికి ప్రత్యేక అవగాహన!
Bhadrachalam: 'సీతా' శిక్షణ తరగతులు ప్రారంభం: మూడ్రోజుల పాటు శిక్షణ!
భద్రాచలం - తెలంగాణ దేవాదాయ శాఖ SITA ద్వారా స్థానిక అంబాసత్రంలో నేటి నుండి మూడు రోజులపాటు శిక్షణ తరగతులను భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం చేత ప్రారంభించబడినాయి.
ఇందులో సీతా డైరెక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు గారు, దేవస్థాన ఈవో శ్రీ కే దామోదర్ రావు గారు, ఏఈఓ ఎస్ భవాని రామకృష్ణ గారు,ఆలయ స్థానాచార్యులు శ్రీ కేఈ స్థల శాయి గారు, రామాయణ పారాయణ దారు ఎస్ టి జి అంతర్వేది కృష్ణమాచార్యులుగారు, వక్త తవాస్మి అకాడమీ శ్రీరామ చక్రధర్ గారు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. ఖమ్మం కొత్తగూడెం జిల్లాలలోని దేవాలయ శాఖ ఆలయాలకు సంబంధించిన మతపర పరిపాలన సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.