Kothagudem: కొత్తగూడెంలో ఐలు జిల్లా విస్తృత సమావేశం
Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా జరిగిన ఐలు (AILU) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విస్తృత సమావేశం. నవంబర్‌లో రాష్ట్ర మహాసభల నిర్వహణకు తీర్మానం.
Kothagudem: కొత్తగూడెంలో ఐలు జిల్లా విస్తృత సమావేశం
కొత్తగూడెం: ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ (ఐలు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ విస్తృత సమావేశం శనివారం కొత్తగూడెంలో ఐలు జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఐలు జిల్లా అధ్యక్షులు కొల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కే. పార్థసారథి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తెలంగాణ బార్ కౌన్సిల్‌కు నూతనంగా ఎన్నికైన బార్ కౌన్సిల్ ఐలు వింగ్ కన్వీనర్ చందా శైలజ, కార్యదర్శి రమేష్ కుమార్ మక్కడ్, రాష్ట్ర కమిటీ కార్యదర్శి పొనుగోటి కిషన్ రావు పాల్గొని న్యాయవాదుల సమస్యలు, సంఘం భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. సమావేశంలో కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు ఇల్లెందు దమ్మపేట నుండి 24 మంది జిల్లా కోర్టు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఐలు రాష్ట్ర మహాసభలను నవంబర్‌లో కొత్తగూడెంలో నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. అదేవిధంగా ఐలు జిల్లా మహాసభలను మణుగూరులో నిర్వహించాలని తీర్మానించారు. సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
తెలంగాణ బార్ కౌన్సిల్ కు కొత్తగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర ఐలు మహిళా వింగ్ కన్వీనర్ చందాల శైలజ.. ఐలు నేషనల్ కౌన్సిల్ మెంబర్స్ ఏడునూతల శ్రీనివాసరావు, జలసూత్రం శివరామ్ ప్రసాద్ పాల్గొన్నారు.
కొత్తగూడెం కోర్టు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు రావిలాల రామారావు కిలారు పురుషోత్తం, మణుగూరు కోర్టు కమిటీ అధ్యక్షుడు పోషం భాస్కర్ దమ్మపేట కోర్టు ఐలు బాధ్యులు వుడతనేని శ్రీనివాస రావు మారం సతీష్ కుమార్ ఐలు జిల్లా కమిటీ సభ్యులు అరికల రవి కుమార్ గడదేసి కాంతయ్య, G.అన్నపూర్ణ T.సునంద,తెల్లబోయిన రమేష్, ఉప్పు అరుణ్ పిట్టల రామారావు దూదిపాల రవికుమార్ మేదరమెట్ల శ్రీనివాస రావు పద్మావతి శైలజ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.