Bhadrachalam: భద్రాచలం గోదావరిలో పడవ పాటను తక్షణమే రద్దు చేయాలి..న్యూడెమోక్రసీ

భద్రాచలం: భద్రాచలం గోదావరిలో పడవ పాటను రద్దు చేయాలి.కనీసం నిబంధనలు పట్టించుకొని పడవ రేవు యాజమాన్యం.ఉదయం 5 గంటల నుండి సాయంత్రం వరకు అధికారుల పరివేక్షణ లేకుండా సాగుతున్న పడవ ప్రయాణం.భద్రాచలం నవంబర్ 24 - ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసిన గ్రామపంచాయతీ రెవెన్యూ అధికారులు ఎక్కడ స్పందించండి. ప్రజల ప్రాణాల్ని కాపాడండి అంటూ భద్రాచలం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్ చేస్తుంది.ఎవరి లాభాల కోసం ఎవరు సహకరిస్తున్నారు.

ప్రజల ప్రాణాల్ని కాపాడాల్సిన బాధ్యత గ్రామపంచాయతీ , రెవెన్యూ అధికారుల మీద ఉంది కానీ ఇక్కడ పడవలో కలిసావు సౌకర్యాలు లేకపోవడంతో యాత్రకులు భయభ్రాంతులకు గురవుతున్నారని వారు తెలిపారు. ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్టు కూడా లేకుండా పడవ ప్రయాణం ఇక్కడ ఎంత జరుగుతున్న సంబంధిత అధికారులకు తెలియకపోవడం గమనార్ధం.

ఒప్పంద పత్రం పాటదారుడు ప్రభుత్వ నిబంధనలకు లోబడి నడుచుకుంటానని స్టాంప్ పేపర్‌పై అగ్రిమెంట్ రాసి ఇచ్చారా.లైసెన్స్ మరియు ఫిట్‌నెస్ పడవకు జలవనరుల శాఖన లేదా పోర్ట్/రెవెన్యూ అధికారుల నుండి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ మరియు రిజిస్ట్రేషన్ వాటికి ఉన్నదా..? పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎందుకు ఎక్కిస్తున్నారు.పడవపై ఎంతమంది ఎక్కవచ్చో స్పష్టంగా ఎందుకు రాయడం లేదు.లైఫ్ జాకెట్లు ప్రయాణించే ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఉండాలి ఏ ఒక్కరికి ఎందుకు ఇవ్వడం లేదు పడవలో లైఫ్ బాయ్స్ (ట్యూబులు), తాళ్లు వంటి రక్షణ పరికరాలు ఉంచాలి. పడవలో ఎందుకు అవన్నీ ఉంచడం లేదు.. కనీసం నైపుణ్యం కలిగిన నావికులు.

లైసెన్స్ కలిగి, ఈత తెలిసిన అనుభవజ్ఞులైన డ్రైవర్లు (నావికులు) మాత్రమే పడవను నడపాలి.పడవ నడిపి వారు సందర్భాన్ని బట్టి మారుతున్నారు ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉన్నాయా.. అవి ఏమీ లేవు..రేట్ల పట్టిక. నిర్ణయించిన ఛార్జీల వివరాలను రేవు వద్ద అందరికీ కనిపించేలా బోర్డుపై ఎందుకు రాయడం లేదు.నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేసే అధికారం అధికారులకు ఉన్నప్పటికీ,ఎందుకు అధికారులు స్పందించడం లేదు. పాట రేవు దారులు ఏ ఒక్క నిబంధన వలె పాటించకుండా చేస్తున్న వాటిని ఎందుకు సీజ్ చేయడం లేదు. రేవు పాటను ఎందుకు రద్దు చేయడం లేదుభద్రాచలం రేవు వద్ద ఒకరికి వంద రూపాయలు చొప్పున వసూళ్లు చేస్తున్న అధికారులు నోరెందుకు మెదపడం లేదు. పాట రేవు రద్దు చేయకపోతే ఉద్యమాలు చేపడుతున్నట్లు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మునిగల శివ ప్రశాంత్ మాస్ లైన్ హెచ్చరించారు.

Tags: