Palwancha: మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలి: కొత్వాల విమలాదేవి!

పాల్వంచ, నవంబర్ 23: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని పాత పాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి అన్నారు. సోమవారం పాత పాల్వంచలో నిర్వహించిన శ్రీదుర్గా పేద ప్రాంత సమాఖ్య సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సమాఖ్య సభ్యులు ఆర్థిక లావాదేవీలు, వార్షిక బడ్జెట్ నివేదిక, పొదుపు వివరాలను కార్పొరేటర్‌కు వివరించారు. అనంతరం విమలాదేవి మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని, సంఘాల్లో ఎలాంటి విభేదాలు లేకుండా ఐక్యమత్యంతో ముందుకు సాగుతూ సంఘాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడంతో పాటు సామాజికంగా కూడా ఎదగాలని ఆకాంక్షించారు.

కార్పొరేటర్‌కు సన్మానం

ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులు కార్పొరేటర్ కొత్వాల విమలాదేవిని శాలువా, బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సి.ఒ సరిత, ఆర్.పి ముత్యాల పుష్పలత, సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

Tags: