Bhadrachalam: రూ.3.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అటవీ అధికారులు
Bhadrachalam: భద్రాచలం అటవీ శాఖ ఎఫ్‌డీవో సుజాత, డీఆర్‌వో కృష్ణయ్య రూ.3.5 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Bhadrachalam
Bhadrachalam: భద్రాచలం అటవీ శాఖలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రూ.3.5 లక్షల లంచం తీసుకుంటుండగా భద్రాచలం ఎఫ్‌డీవో సుజాత, చర్ల ఇంచార్జ్ డీఆర్‌వో కృష్ణయ్యలను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.
సమాచారం ప్రకారం చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో రహదారి నిర్మాణ పనుల సమయంలో కొన్ని చెట్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఎఫ్‌డీవో సుజాత రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం భద్రాచలం కార్యాలయంలో రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనతో అటవీ శాఖలో అవినీతి అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా కొత్తగూడెం అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన ఓ జిల్లా అధికారి లంచం కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే.