Khammam: చిక్కిన ఇసుక హైదరాబాద్‌లో మాస్టర్‌మైండ్ పార్థసారథి అరెస్ట్!

Khammam: ఏపీ ఉచిత ఇసుకను తెలంగాణకు దారిమళ్లిస్తున్న అంతర్రాష్ట్ర ఇసుక స్మగ్లర్ పాటిబండ్ల పార్థసారథి చౌదరిని ఖమ్మం జిల్లా వేంసూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2026-05-05 09:29 GMT

Khammam: చిక్కిన ఇసుక హైదరాబాద్‌లో మాస్టర్‌మైండ్ పార్థసారథి అరెస్ట్!

ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆ రాష్ట్ర ప్రజలకు ఇచ్చే ఉచిత ఇసుకను ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కడప గ్రామానికి చెందిన పాటిబండ్ల పార్ధసారది చౌదరి @ పార్ధసారది అనే వ్యక్తి దారి మళ్ళించి, తనకు ఉన్న 3 లారీల ద్వారా అట్టి ఉచిత ఇసుకను కొవ్వూరు గోదావరి నది ఇసుక ర్యాంప్ నుండి తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో సరిహద్దు మండలాలైన సత్తుపల్లి మరియు వేంసూర్ గ్రామాలకు తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్ర మైనింగ్ చట్టాలకు వ్యతిరేకంగా ఆర్గనైజడ్ పద్ధతిలో మధ్యవర్తులను పెట్టుకుని అక్రమ ఇసుక దందా చేస్తూ , తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున నష్టం కలిగిస్తుండడంతో, ఇతని పలుమార్లు పట్టుకొని ఇప్పటివరకు ఎనిమిది కేసులు నమోదు చేయడం జరిగినది.

అయినా ఇతను పద్ధతి మార్చుకోకుండా తేది 30.03.2026 న తన యొక్క AP 16 TJ 4888 లారీలో కొవ్వూరు గోదావరి నది ఇసుక ర్యాంప్ యందు ఇసుకను లోడ్ చేసుకొని అక్రమంగా తన లారీ డ్రైవరు అయిన ఈదర విష్ణు వర్ధన్ ద్వారా, కల్లూరుగూడెం గ్రామం యందు ఉన్న తన మధ్యవర్తి ద్వారా, కల్లూరు గూడెం పంపి అక్కడ ఇసుకను అమ్ముతుండగా, వేంసూర్ ఎస్ఐ కవిత, తన సిబ్బంది లారీ డ్రైవర్ను ఇసుక లారీ తో సహా పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది.

విచారణలో పాటిబండ్ల పార్థసారథి, అతని మధ్యవర్తి ఆముదాల మధు ప్రమేయము బయటపడడంతో వారిపై చీటింగ్, ఆర్గనైజేడ్ క్రైమ్ క్రింద కేసు నమోదు చేయ నైనది. ఆరోజు నుండి నిందితుడు పాటిబండ్ల పార్ధసారది చౌదరి r/o కడప, రెడ్డిగూడెం మండలం తప్పించుకొని తిరుగు చుండగా.. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆదేశాల మేరకు హైదరాబాదు రామోజీ పిల్మ్ సిటీ దగ్గరలో పార్ధసారది చౌదరిని, కల్లూరుగూడెం వద్ద ఆముదాల మధుని అరెస్టు చేసి సత్తుపల్లి కోర్టు నందు హహజరు పర్చనైనది.

Tags:    

Similar News